Mukesh Ambani Wadia : వాడియా కేసులో అంబానీకి ఊరట
విచారించేందుకు ఒప్పుకోని కోర్టు
Mukesh Ambani Wadia : రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీకి ఊరట లభించింది. నుస్లీ వాడియా హత్యాయత్నం కేసులో అంబానీని సాక్షిగా పిలిచేందుకు కోర్టు నిరాకరించింది. 33 ఏళ్ల నాటి ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ఇవాన్ సిక్వేరా ముఖేష్ అంబానీని సాక్షిగా విచారించాలని కోరుతూ గత ఏడాది ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో ముఖేష్ అంబానీని విచారించాలన్న అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది.1989లో వ్యాపారవేత్త నుస్లీ వాడియాపై హత్యా యత్నం చేసిన కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని(Mukesh Ambani Wadia) సాక్షిగా పిలవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు సోమవారం తిరస్కరించింది.
ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ఇవాన్ సీక్వేరా అంబానీని సాక్షిగా విచారించాలని కోరుతూ గత ఏడాది ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. కేసును విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీ ఈ పిటిషన్ ను వ్యతిరేకించింది.
డిఫెన్స్ , ప్రాసిక్యూషన్ రెండింటినీ విన్న తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నింబాల్కర్ , సిక్వేరా అభ్యర్థనను తిరస్కరించారు.
కాగా న్యాయవాది ప్రకారం ప్రాసిక్యూషన్ ఎవరినీ సాక్షిగా పిలిపించాలో నిర్ణయించడంలో నిందితుడికి ఎటువంటి హక్కు లేదని కోర్టు దరఖాస్తును తిరస్కరించింది.
అంతకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఈ కేసులో తదుపరి దర్యాప్తును కోరే హక్కు నిందితుడికి లేదని , అతని దరఖాస్తును కొట్టి వేయాలని పేర్కొంది. మరాఠా సర్కార్ ఆగస్టు 2, 1989 న దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది.
Also Read : సీబీఐ అరెస్ట్ అక్రమం – వేణుగోపాల్ ధూత్