VC Sajjanar : రికార్డు స్థాయిలో జనం జర్నీ – సజ్జనార్
స్పష్టం చేసిన మేనేజింగ్ డైరెక్టర్
VC Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ వేళ రికార్డు స్థాయిలో ప్రయాణీకులు జర్నీ చేశారంటూ చెప్పారు. జనవరి 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణీకులు తమ సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని వెల్లడించారు.
గత ఏడాది పండుగతో పోలిస్తే ఈసారి 5 లక్షలు మంది ఎక్కువగా ప్రయాణం చేశారని తెలిపారు సజ్జనార్. ఇప్పటి వరకు నాలుగు రోజులలో 3,203 ప్రత్యేక బస్సులను నడిపించామని పేర్కొన్నారు. ముందుగా నిర్దేశించిన నిర్ణయం మేరకు 2,384 బస్సులను నడపాలని అనుకున్నామని కానీ రోజు రోజుకు పెద్ద ఎత్తున జనం తమ ప్రాంతాలకు వెళ్లేందుకు రావడంతో అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లు స్పష్టం చేశారు సజ్జనార్(VC Sajjanar) .
ఈ సందర్భంగా సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు ఎండీ. ఈసారి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదని తెలిపారు సజ్జనార్. భవిష్యత్తు లోనూ సంస్థను ఇలాగే ప్రోత్సహించాలని కోరారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి 212 ప్రత్యేక బస్సులు ఉన్నాయని చెప్పారు.
మరో వైపు సంక్రాంతికి వెళ్లి తిరిగి వచ్చే వారి కోసం 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు సజ్జనార్. విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి, డ్రైవర్లు, కండక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు మేనేజింగ్ డైరెక్టర్.
ఊహించని రీతిలో తెలంగాణ ఆర్టీసీకి ఆదాయం సమకూరిందని వెల్లడించారు వీసీ సజ్జనార్. ప్రయాణీకులకు అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు సజ్జనార్(VC Sajjanar).
Also Read : మేరా భారత్ మహాన్..జై హింద్