PM KISAN : రైతన్నలకు మోదీ ఖుష్ కబర్
ఇక నుంచి రూ. 6 వేలు కాదు రూ. 8 వేలు
PM KISAN : ఆరుగాలం శ్రమించే రైతన్నలకు శుభవార్త చెప్పింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రతి ఏటా రూ. 6 వేలు కాకుండా ఇక నుంచి రూ. 8 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ ) పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రారంభించారు.
కేవలం సన్నకారు, చిన్నకారు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు గాను ఈ స్కీమ్ ను ఏర్పాటు చేసింది. దీని వల్ల రైతు కుటుంబాలకు పెట్టుబడి ఆసరా కల్పించింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6 వేలు ఇచ్చేంది. రూ. 2 వేల చొప్పున ఇచ్చేది. 12 వాయిదాల నగదును రైతులకు అందించింది.
ఈసారి 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం పెద్ద ఎత్తున రైతులు (PM KISAN) వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మరికొంత రైతులకు భరోసా కల్పించేందుకు కొంత మొత్తాన్ని పెంచేందుకు యోచిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ తయారీలో నిమగ్నమైంది.అర్హులైన రైతులకు నాలుగు వాయిదాలలో చెల్లించనుంది. రూ. 2 వేల చొప్పున చెల్లించనుంది. ఇప్పటి వరకు నాలుగు నెలలకు ఒక వాయిదా చొప్పున చెల్లిస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరం 2023 లో ఖుష్ కబర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నిర్ణయానికి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మత మార్పిడి చట్టం’పై తీర్పు వద్దు