Sanjay Raut : కాశ్మీరీ హిందువుల ధర్నాకు రౌత్ మద్దతు
20న రాహుల్ యాత్రలో పాల్గొననున్న ఎంపీ
Sanjay Raut : శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా శివసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పార్టీ పూర్తిగా రాహుల్ యాత్రకు సపోర్ట్ గా నిలిచింది. ఈ తరుణంలో సంజయ్ రౌత్ జనవరి 19, 20, 21 తేదీల్లో జమ్మూలో భారత్ జోడో యాత్రలో చేరనున్నారు. అనంతరం పాక్ ఆక్రమిక జమ్మూ కాశ్మీర్ , మైనార్టీ హోదా గురించి సిక్కు ప్రతినిధులను కూడా కలవనున్నారు. ఇదే సమయంలో 19న సంజయ్ రౌత్(Sanjay Raut) జమ్మూకు చేరుకుంటారు.
అక్కడ కాశ్మీర్ నుండి జమ్మూ ప్రాంతానికి తరలించాలనే డిమాండ్ కు మద్దతుగా నిరసనలు చేస్తున్న కాశ్మీరీ హిందువులను కలవనున్నారు. ఇదిలా ఉండగా మనీష్ సాహ్ని నేతృత్వంలోని శివసేన నాయకులు లోయలో పోస్ట్ చేసిన కాశ్మీరీ హిందూ ఉద్యోగులు చేపట్టిన ధర్నాలో చేరారు. వారి పునరావాస డిమాండ్ కు పూర్తి మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా సాహ్ని మాట్లాడుతూ బాధితులకు ముందుగా పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన చేపట్టిన ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేక పోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శివసేన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదన్నారు.
దాడులు, హత్యలకు భయపడి తమను లోయ నుండి బదిలీ చేయాలని కోరుతూ 251 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించు కోవడం లేదంటూ సాహ్ని ఆరోపించారు.
Also Read : ఆ ఇద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా