CV Ananda Bose : రాజ్ భ‌వ‌న్ పోర్టికోకు నేతాజీ పేరు

గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్

CV Ananda Bose : నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ కు సంబంధించిన స్మృతుల‌ను చ‌రిత్ర చెత్త‌బుట్ట ల్లోని నెట్టివే సే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose). కోల్ క‌తా లోని రాజ్ భ‌వ‌న్ పోర్టికో పేరును నేతాజీ పోర్టికో గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌ల‌స శ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ చేసిన గొప్పనైన ధిక్కార చ‌ర్య‌కు గుర్తుగా ఒక క‌ళాఖండం లేదా శిల్పాన్ని ఉంచ బ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇండియ‌న్ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో స‌క్సెస్ అయ్యాక కోల్ కోతా లోని త‌న కార్యాల‌యంలో బ్రిటీష్ గ‌వ‌ర్న‌ర్ జ‌న‌రల్ ను క‌లిసిన్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చారిత్రాత్మ‌కంగా త‌న గొడుగును తీసుకెళ్ల‌కుండా నిషేధాన్ని ధిక్కరించారు. ఆ ప్ర‌దేశమే పొర్టికో. బెంగాల్ ఛాంబ‌ర్ ప్రాంగ‌ణంలో నేతాజీ స్మృత్య‌ర్థం స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్నర్ హాజ‌ర‌య్యారు.

ప్ర‌ముఖ ఆర్థిక వేత్త , భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యుడైన సంజీవ్ స‌న్యాల్ రాసిన పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose). ఆ పుస్తకం పేరు ది అద‌ర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వోన్ ఇట్స్ ఫ్రీడ‌మ్. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స‌ముచిత స్థానాన్ని చ‌రిత్ర నుండి ఎవ‌రు తొల‌గించార‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శ్నించారు.

ర‌వీంద్ర నాథ్ ఠాగూర్ తో పాటు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి త‌న‌కు చిన్న‌త‌నంలో క‌థ‌లుగా చెప్పే వార‌ని గుర్తు చేసుకున్నారు.

Also Read : మోదీ విదేశాంగ విధానం భేష్

Leave A Reply

Your Email Id will not be published!