Supreme Court Google : గూగుల్ పై సుప్రీంకోర్టు విచార‌ణ

యూర‌ప్ లో అనుస‌రించే విధానంపై ఆరా

Supreme Court Google : టెక్ దిగ్గ‌జం గూగుల్ కు సంబంధించిన కేసును స‌ర్వోత న్యాయ స్థానం విచారించింది. నేష‌న‌ల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ (ఎన్సీఎల్ఏటీ) పోటీ నియంత్ర‌ణ సంస్థ‌పై రూ. 1,337 కోట్ల భారీ పెనాల్టీ విధించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది గూగుల్ కంపెనీకి. ఈ పెనాల్టీకి సంబంధించి మ‌ధ్యంథ‌ర స్టేను నిరాక‌రించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ యుఎస్ కు చెందిన గూగుల్ కంపెనీ(Supreme Court Google) పిటిష‌న్ దాఖ‌లు చేసింది సుప్రీంకోర్టులో.

విచార‌ణ‌లో భాగంగా కీల‌క ప్ర‌శ్న‌లు సంధింధించి సుప్రీం ధ‌ర్మాస‌నం. ఆండ్రాయిడ్ ఆధారిత ప్రీ ఇన్ స్టాల్ చేసిన యాప్ ల‌కు సంబంధించి యూర‌ప్ లో అనుస‌రించే విధానాన్ని భార‌త దేశంలో కూడా అనుస‌రిస్తారా అని సుప్రీంకోర్టు నిల‌దీసింది. గూగుల్ ను ప్ర‌శ్నించింది.

విచార‌ణ‌లో భాగంగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ , న్యాయ‌మూర్తులు పీఎస్ న‌ర‌సింహ‌, జేబీ పార్థివాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం త‌దుప‌రి విచార‌ణ‌లో ఈ అంశంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు టెక్ కంపెనీ గూగుల్ త‌ర‌పున వాదిస్తున్న న్యాయ‌వాది ఎం. సింఘ్వీకి సూచించింది.

యూరోపియ‌న్ క‌మిష‌న్ ఆమోదించిన ఇదే విధ‌మైన ఉత్త‌ర్వును గూగుల్ పాటించింద‌ని కాంపీష‌న్ క‌మిష‌న్ ఇఫ్ ఇండియా త‌ర‌పున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్. వెంక‌ట‌రామ‌న్ అఫిడ‌విట్ స‌మ‌ర్పించిన త‌ర్వాత ఈ ప‌రిశీల‌న వ‌చ్చింది. భార‌తీయ యూజ‌ర్ల ప‌ట్ల గూగుల్ వివ‌క్ష చూపుతోంద‌ని ఏఎస్జీ ఆరోపించింది.

సీసీఐ అసాధార‌ణ ఆదేశాలు జారీ చేసింద‌ని, జ‌న‌వ‌రి 19 లోగా ఈ ఉత్త‌ర్వుల‌ను పాటించాల‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది కోరారు.

Also Read : షేర్ చాట్ లో ఉద్యోగులపై వేటు

Leave A Reply

Your Email Id will not be published!