Rahul Gandhi Security : రాహుల్ గాంధీ సెక్యూరిటీ అలర్ట్
కొన్ని ప్రాంతాల్లో నడవవద్దని సూచన
Rahul Gandhi Security : కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. ఈనెల 31న ఆయన చేపట్టిన యాత్ర కాశ్మీర్ తో ముగుస్తుంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా దేశంలోని 24 పార్టీలకు ఆహ్వానం పంపింది.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాలలో పాదయాత్ర చేపట్టవద్దని సెక్యూరిటీ ఏజెన్సీలు రాహుల్ గాంధీని(Rahul Gandhi Security) హెచ్చరించినట్లు సమాచారం. ఆయన యాత్రపై భద్రత గురించి సమీక్షించింది. రాహుల్ గాంధీ శ్రీనగర్ లో ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే ఉండాలని సూచించాయి.
రాహుల్ గాంధీ సురక్షితంగా ఉండేందుకు ఇప్పటికే ప్లాన్ రూపొందించారు. కాలినడకన కొన్ని ప్రాంతాలలో మాత్రమే నడవాలని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల పాదయాత్రకు బదులు కారులో ప్రయాణం చేయాలని కోరినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 52 ఏళ్ల వయస్సు కలిగిన రాహుల్ గాంధీ జనవరి 25న జమ్మూ కాశ్మీర్ లోని బనిహాల్ లో జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.
రెండు రోజుల తర్వాత జనవరి 27న అనంత్ నాగ్ మీదుగా శ్రీనగర్ లోకి ప్రవేశిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరగనుంది దేశ వ్యాప్తంగా. ఆరోజు జాతీయ పతాకాన్నిఎగుర వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది.
జనవరి 19న రాహల్ గాంధీ లఖన్ పూర్ లోకి ప్రవేశిస్తారు. కతువా లోని హత్లీ మోర్ నుండి బయలు దేరుతారు. జనవరి 21న హీరా నగర్ నుండి దుగ్గర్ హవేలి, విజయపూర్ నుండి సత్వారి దాకా కొనసాగుతుంది యాత్ర.
Also Read : మోదీతో చర్చలకు సిద్ధం – పీఎం