KTR Davos : నేనూ ఒక‌ప్పుడు ఎన్నారైనే – కేటీఆర్

దావోస్ ఎక‌నామిక్ స‌ద‌స్సులో మంత్రి

KTR Davos : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆద‌ర్శ ప్రాయంగా మారింది. ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రానికి క్యూ క‌డుతున్నార‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో(KTR Davos) ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా ఆహ్వానం అందుకున్న కేటీఆర్ త‌న బృందంతో క‌లిసి దావోస్ కు చేరుకున్నారు. దిగ్గ‌జ కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ లు , వివిధ దేశాల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖుల‌తో భేటీ అయ్యారు కేటీఆర్. తెలంగాణ స‌ర్కార్ తో క‌లిసి రావాల‌ని, రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాల‌ని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ప్ర‌వాస భార‌తీయులు స‌హ‌కారం అందించాల‌ని కోరారు. జ్యూరిచ్ న‌గ‌రంలో ఎన్ఐఆర్ లు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మాట్లాడారు. ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా ఒకప్పుడు ఎన్నారైనేన‌ని అన్నారు మంత్రి(KTR Davos). చాలా కాలం విదేశాల్లో ప‌ని చేసి ఇండియాకు తిరిగి వెళ్లాన‌ని తెలిపారు.

భార‌త్ లో ఉన్న వారికి ఇత‌ర దేశాలపై ఫోక‌స్ ఉంటుంద‌ని కానీ అక్క‌డి వాళ్ల‌కు మ‌న‌లో ఏం జ‌రుగుతుందోన‌ని ఆస‌క్తి ఉంటుంద‌న్నారు కేటీఆర్. ప‌ల్లె ప్రాంత జీవితాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నంత గొప్ప‌గా దేశంలో ఇంకెవ‌రూ ఏ నేత అర్థం చేసుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు కేటీఆర్.

ఇండియా గ్లోబ‌ల్ క్యాపిట‌ల్ ఆఫ్ పూర్ పీపుల్ గా మారింద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌వాస భార‌తీయులు అర్థం చేసుకోవాల‌ని సూచించారు మంత్రి.

Also Read : ఫేస్ బుక్..మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!