Abdul Rehman Makki : అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్ట్
ప్రకటించిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి
Abdul Rehman Makki : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచంలో ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారింది పాకిస్తాన్. ఇదే విషయాన్ని భారత దేశం పదే పదే ప్రస్తావిస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ) సంచలన ప్రకటన చేసింది.
పాక్ కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ప్రపంచ ఉగ్రవాదిగా వెల్లడించింది. దీంతో మరోసారి పాకిస్తాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. లష్కరే తోయిబా నాయకుడిని గ్లోబల్ టెర్రరిస్ట్ గా పేర్కొనేందుకు 2020లో భారత దేశం చేసిన ప్రయత్నం తర్వాత ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఇప్పటికే భారత్ , అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం ఉగ్రవాద జాబితాలో చేర్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్ఇటీ) చీఫ్ హఫీజ్ సయీద్ బావ మరిది అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీని(Abdul Rehman Makki) ఐఎస్ఐఎల్ ఆధ్వర్యంలో గ్లోబల్ టెర్రరిస్ట్ గా లిస్టులో చేర్చింది.
విచిత్రం ఏమిటంటే జూన్ 2022లో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఆంక్షల కమిటీ కింద టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితా చేయాలనే ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. ఇదే అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. పాకిస్తాన్ ప్రధానంగా ఉగ్రవాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చేస్తోందంటూ ఆరోపించింది. చివరకు భారత్ చేసిన ప్రయత్నం విఫలమైంది.
Also Read : : కాశ్మీరీ హిందువుల ధర్నాకు రౌత్ మద్దతు