Shehbaz Sharif Modi : మోదీతో చర్చలకు సిద్ధం – పీఎం
స్పష్టం చేసిన షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif Modi : దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్. భారత దేశంతో సత్ సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీతో చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఓ వైపు ఉగ్రవాదం, ఆకలి, పేదరికం పాకిస్తాన్ ను కాటు వేసేలా చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయ అస్థిరత చోటు చేసుకుంది. మరో వైపు యావత్ ప్రపంచంలోని పలు దేశాల అధినేతలు భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.
గత ఏడాది 2022 నవంబర్ చివరలో భద్రతా దళాలతో తెహ్రీక్ – ఇ- తాలిబాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణను ముగించిన తర్వాత పాకిస్తాన్ తీవ్రవా సంబంధిత హింసను చూసింది. ఈ సమయంలో గతంలో ఏం జరిగిందో అనే దానిపై పట్టించు కోదల్చు కోలేదన్నారు. దుబాయ్ కు చెందిన అరబిక్ న్యూస్ ఛానల్ అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif).
భారత దేశంతో జరిగిన మూడు యుద్దాలు ప్రజలకు అదనపు బాధలు, పేదరికం, నిరుద్యోగాన్ని మాత్రమే పరిచయం చేశాయని అన్నారు పీఎం. కశ్మీర్ వంటి ప్రధాన సమస్యలను పరిస్కరించేందుకు కూర్చుని చర్చించు కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రర మోదీతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు షెహబాజ్ షరీఫ్.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం – ఓం బిర్లా