Rahul Gandhi : కాషాయం దేశానికి ప్రమాదం – రాహుల్
ఆ భావజాలం నాకు సరిపడదు
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ , ఏబీవీపీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆర్ఎస్ఎస్ భావజాలం నచ్చదని స్పష్టం చేశారు. కులం, మతం , ప్రాంతం పేరుతో ప్రజలను విడదీసే రాజకీయాలకు పాల్పడడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు.
ఆర్ఎస్ఎస్ కళ్లలోకి చూడాలంటూ తనను ఎవరూ ఒత్తిడి చేయలేరని మండిపడ్డారు. అలాంటి పరిస్థితే గనుక వస్తే తాను తల తీసుకునేందుకైనా సిద్దంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా తమ నుంచి విడి పోయి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుని, ఎంపీగా, గతంలో మంత్రిగా పని చేసిన సోదరుడు వరుణ్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జోరందుకుంది.
దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. అతడి భావజాలం వేరు తన భావజాలం వేరు అని పేర్కొన్నారు. వరుణ్ గాంధీ వ్యక్తిగత విషయమని, తాను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. మతం పేరుతో మనుషుల్ని విడదీసే రాజకీయాలను తాను ఏనాటికీ ఒప్పుకునని కుండ బద్దలు కొట్టారు రాహుల్ గాంధీ.
ఒకవేళ తనను కలిసేందుకు తన సోదరుడు వరుణ్ గాంధీ వస్తే తప్పక స్వాగతం పలుకుతానని, ఆలింగనం చేసుకుంటానని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తన సోదరుడు వస్తే తనకు అభ్యంతరం లేదన్నారు యువ నాయకుడు.
Also Read : ఢిల్లీ ఎల్జీపై కేజ్రీవాల్ కన్నెర్ర