Bandi Sanjay Son Case : ‘బండి’కి బిగ్ షాక్ కొడుకుపై కేసు
దాడికి పాల్పడ్డాడని యూనివర్శిటీ ఫిర్యాదు
Bandi Sanjay Son Case : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు(Bandi Sanjay Son Case) కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పుత్ర రత్నం బండి దశరథ చేసిన నిర్వాకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. ఇప్పటికే తెలంగాణలో తన మాటల తూటాలతో హోరెత్తిస్తూ, ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తున్న బండి సంజయ్ కి ఉన్నట్టుండి కొడుకు చేసిన నిర్వాకం మెడకు చుట్టుకునేలా చేసింది.
అయితే బీజేపీ స్టేట్ చీఫ్ మాత్రం కావాలని తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసు బనాయించారంటూ ఆరోపించారు. దీనిని ఆయన కుట్రగా అభివర్ణించారు. అయితే గతంలో ఎన్నడో జరిగిందని అన్నారు. ఎప్పుడు జరిగినా దాడి చేసింది వాస్తవమా కాదా అన్నది ముఖ్యం.
అంతే కాదు తన కొడుకు చదువుకుంటున్న మహీంద్రా యూనివర్శిటీనే స్వయంగా బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి దశరథపై ఫిర్యాదు చేయడం విశేషం. దీంతో దుండిగల్ పోలీసులు వెంటనే కేసు(Bandi Sanjay Son Case) నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఎంత బీజేపీ చీఫ్ అయినంత మాత్రాన ఇలా ఇతర విద్యార్థులపై దాడికి పాల్పడతారా అంటూ మండిపడుతున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ బిడ్డలపై కూడా ఇలా తమ పిల్లలతో దాడులు చేయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా నిన్నటి దాకా తమపై దాడికి దిగుతూ వస్తున్న బండి సంజయ్ పై ఆరోపణలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలకు మంచి ఛాన్స్ దొరికినట్లయింది.
మొత్తంగా ఇప్పుడు బండి కొడుక్కి యవ్వారంపై రాద్దాంతం జరుగుతోంది.
Also Read : బండి భాష్యం సీఎంకు ఏం సంబంధం