Bandi Sanjay : దాడి దుమారం నా కొడుకు బంగారం
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కొడుకు బండి దశరథ దాడి ఘటన. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మహీంద్రా యూనివర్శిటీ తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనపై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం విస్తు పోయేలా చేసింది. తన కొడుకుపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్. పిల్లలు అన్నాక కొట్లాడుకుంటారని ఆ తర్వాత కలిసి పోతారని నచ్చ చెప్పేందుకు యత్నించారు బీజేపీ స్టేట్ చీఫ్.
తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారా..విధి విధానాలు పాటించారా అని పోలీసులను ప్రశ్నించారు. తప్పు చేసినట్లయితే తాను జైలుకు పంపిస్తానని అన్నారు బండి సంజయ్(Bandi Sanjay). నా కొడుకుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. రాజకీయాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
దమ్ముంటే సీఎం కేసీఆర్ తనతో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. ఈ వీడియో ఘటనపై బాధిత విద్యార్థి స్పందించాడు. బండి భగీరథ కొట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అది తన తప్పేనని చెప్పాడు. తమ స్నేహితుడి సోదరిని ప్రేమించమని భగరీథ ఫోన్లు , మెస్సేజ్ లు చేశాడంటూ ఆరోపించారు.
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియో ఘటనపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు.
Also Read : నోరు మూసేందుకు లంచం ఇచ్చారు