AAP MLA Waved : నోరు మూసేందుకు లంచం ఇచ్చారు
అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యే ఆరోపణ
AAP MLA Waved : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మొహిందర్ గోయల్(AAP MLA Waved) నోట్ల కట్టలతో ప్రత్యక్షమయ్యాడు. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది ఈ వ్యవహారం. ఢిల్లీలో శాసనసభ కొనసాగుతోంది. బుధవారంతో ఇవాళ మూడోరోజు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగానే తాను తీసుకు వచ్చిన సంచిలోంచి నోట్ల కట్టలను తీసి ప్రదర్శించారు.
దీంతో అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. స్పీకర్ ను ఉద్దేశించి మొహిందర్ గోయల్ తన నోరు మూయించేందుకు మాఫియా ప్రయత్నం చేసిందని, ఈ నోట్ల కట్టలను లంచంగా ఇచ్చిందంటూ ఆరోపించారు. సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఆప్ రితాలా ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ కీలక కామెంట్స్ చేశారు.
తనకు డబ్బులు ఎందుకు ఇచ్చారో కూడా చెప్పారు. ఢిల్లీ లోని మొహల్లా, దవాఖానాల్లో ఉద్యోగాలను మాఫియా భర్తీ చేస్తోందంటూ ఆరోపించారు. వీటి ఎంపికకు సంబంధించి తనకు లంచంగా రూ. 15 లక్షలు ఇచ్చారంటూ మండిపడ్డారు. తనను కరెన్సీ నోట్లతో కొనాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు మొహిందర్ గోయల్.
లంచం ఇచ్చి తన గొంతును ఆపాలని యత్నించారంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే. ఈ విషయం గురించి ఎల్జీ సక్సేనాకు, సీఎస్ కు తెలిపినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తప్పేనని కానీ నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా ప్రదర్శించాల్సి వచ్చిందన్నారు ఆప్ ఎమ్మెల్యే(AAP MLA Waved).
అసెంబ్లీలో సిబ్బంది నియామకం అంశాన్ని గోయల్ ప్రస్తావించారు. రూల్స్ ప్రకారం జాబ్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు ఎమ్మెల్యే. నర్సింగ్ , ఇతర పోస్టులకు టెండర్లు వేశారని , రూల్స్ కు పాతర పెట్టారని అన్నారు.
Also Read : కాంగ్రెస్ కు గుడ్ బై బీజేపీకి బాదల్ జై