Supreme Court Wikipedia : వికీపీడియాపై ఆధార ప‌డితే ఎలా

సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్

Supreme Court Wikipedia : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏదైనా స‌మాచారం కోసం ఇంట‌ర్నెట్ లో లేదా ఇత‌ర మాధ్య‌మాల ద్వారా వెత‌క‌డం మామూలే. ఇదే స‌మ‌యంలో మొత్తంగా వికీపీడియాపై(Supreme Court Wikipedia) ఆధార‌ప‌డితే ఎలా అని, దానిని ప్రామాణికంగా తీసుకోలేమంటూ స్ప‌ష్టం చేసింది కోర్టు.

వికీపిడియా వంటి ఆన్ లైన్ మూలాధారాలు పూర్తిగా ఆధార‌ప‌డిన‌వి కావ‌ని పేర్కొంది. న్యాయ‌మూర్తులు సూర్య‌కాంత్ , విక్ర‌మ్ నాథ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఫ్లాట్ ఫారమ్ ల ప్ర‌యోజ‌నాన్ని గుర్తించింద‌ని , అయితే చ‌ట్ట ప‌ర‌మైన వివాద ప‌రిష్కారానికి అటువంటి మూలాల‌ను ఉప‌యోగించ వ‌ద్దంటూ హెచ్చ‌రించింది.

మ‌రింత విశ్వ‌స‌నీయ వ‌న‌రుల‌పై ఆధార ప‌డేలా న్యాయ‌వాదుల‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ధ‌ర్మాస‌నం సూచించింది. వికీపీడియా వంటి ఆన్ లైన్ మూలాలు క్రౌడ్ సోర్స్ , యూజ‌ర్ జ‌న‌రేట్ ఎడిటింగ్ మోడ‌ల్ పై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇవి పూర్తిగా ఆధార ప‌డ‌ద‌గిన‌వి కావు. త‌ప్పుదారి ప‌ట్టించే స‌మాచారాన్ని ప్ర‌చారం చేయ‌గ‌ల‌వ‌ని హెచ్చ‌రించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా విజ్ఞానానికి ఉచిత ప్రాప్య‌త‌ను అందించే ప్లాట్ ఫార‌మ్ ల ప్ర‌యోజ‌నాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. చ‌ట్ట ప‌ర‌మైన వివాద ప‌రిష్కారానికి అటువంటి మూలాల‌ను ఉప‌యోగించ‌వ‌ద్దంటూ హెచ్చ‌రించింది.

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ మూలాధారాలు విజ్ఞాన నిధి అయిన‌ప్ప‌టికీ స‌మూహ మూలం, వినియోగదారు రూపొందించిన ఎడిటింగ్ మోడ‌ల్ పై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా గుర్తించిన విధంగా త‌ప్పుదారి ప‌ట్టించే స‌మాచారాన్ని ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

Also Read : త‌మిళ‌నాడు పేరు మార్చాల‌ని అన‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!