Assembly Polls 2023 : మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
Assembly Polls 2023 : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారం దేశంలోని మూడు రాష్ట్రాలలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ , మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలలో జరిగే శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుదుకు గాను తేదీలను ప్రకటించింది.
వచ్చే నెల ఫ్రిబవరి 16న అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls 2023) జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవాళ సీఈసీ మీడియాతో మాట్లాడారు ఇతర ఎన్నికల కమిషనర్లతో కలిసి. మరో రెండు రాష్ట్రాలు నాగాలాండ్ , మేఘాలయాలలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
ఈ మూడు రాష్ట్రాల పోలింగ్ అనంతరం మార్చి 2న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో దేశంలో త్వరలో నిర్వహించబోయే రాష్ట్రాలలో పర్యటించింది. ఆయా రాష్ట్రాలలోని రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైంది.
పలువురు నాయకులు, పార్టీల బాధ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. ఇదిలా ఉండగా ఆయా రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే నాగాలాండ్ లో 60 స్థానాలు ఉండగా త్రిపుర, మేఘాలయాలలో కూడా 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మరో వైపు కొత్తగా రిమోట్ సెన్సింగ్ పోలింగ్ విధానం ప్రవేశ పెట్టడంపై సీఈసీ ప్రతిపాదన తీసుకు వచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రతిపక్షాలు.
Also Read : మెరిసిన రాధికా మర్చంట్