CM Pinarayi Vijayan : ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం – పిన‌ర‌యి

మోదీ స‌ర్కార్ వ‌ల్ల దేశానికి న‌ష్టం

CM Pinarayi Vijayan : ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్. బుధ‌వారం సీఎం కేసీఆర్ సార‌థ్యంలో ఖ‌మ్మంలో నిర్వ‌హించిన‌ భార‌త రాస్ట్ర స‌మితి పార్టీ ఆవిర్భావ స‌భ‌లో పిన‌ర‌యి విజ‌య‌న్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. కాషాయ శ్రేణుల వ‌ల్ల దేశం మ‌రింత వెన‌క్కి వెళ్లే ప్ర‌మాదం ఉందంటూ హెచ్చ‌రించారు.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ది గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం బాగుంద‌ని కితాబు ఇచ్చారు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్(CM Pinarayi Vijayan). ప‌లు రాష్ట్రాల‌కు బేష‌ర‌తుగా సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మంచి ప‌ద్ద‌తి అని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో కేంద్రం కావాల‌ని బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని పాల‌నా వ్య‌వ‌స్థ‌కు భంగం క‌లిగించేలా చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్. బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు పూర్తిగా ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, పాల‌కులు పూర్తిగా నిద్ర పోతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు సీఎం.

బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ల శ‌క్తుల్లో మోదీ కీలు బొమ్మ‌గా మారారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్రంపై ప్ర‌త్యేకించి పీఎం మోదీపై సీఎం కేసీఆర్ పోరాడాల‌ని పిలుపునిచ్చారు. త‌మ మ‌ద్ద‌తు త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు పిన‌ర‌యి విజ‌య‌న్(CM Pinarayi Vijayan).

ఇవాళ దేశం అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది. ప్ర‌త్యేకించి బీజేపీయేత‌ర రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశ స‌మ‌గ్ర‌త‌ను, న్యాయాన్ని, హ‌క్కుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. క‌లిసిక‌ట్టుగా యుద్దం చేయాలన్నారు.

Also Read : గుట్ట‌లో సీఎంలు స్వామికి పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!