Jyotiraditya Scindia : తలుపు తెరిచిండు క్షమాపణ చెప్పిండు
ఎంపీ తేజస్విని వెనకేసుకు వచ్చిన మంత్రి
Jyotiraditya Scindia : భారతీయ జనతా పార్టీకి చెందిన కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ ఎమర్జెన్సీ డోర్ తెరిచారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఎంపీ ఇలా ఎలా చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో ఎంపీ తేజస్వి సూర్య మౌనంగా ఉండగా ఆయనను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). బుధవారం ఆయన ఈ ఘటనపై స్పందించారు. అనుకోకుండా ఇది జరిగిందని, తమ పార్టీకి చెందిన ఎంపీ తేజస్వి సూర్య పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచారంటూ తెలిపారు.
ఇందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. తనిఖీల తర్వాత మాత్రమే విమానం తన గమ్య స్థానం తిరుచిరాపల్లికి బయలు దేరిందని , అందుకే ఆలస్యం జరిగిందని తెలిపారు. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను పొరపాటున తెరిచారని పేర్కొన్నారు జ్యోతిరాదిత్య సింధియా.
ఇదిలా ఉండగా కర్ణాటక ఎంపీపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ ఘటన డిసెంబర్ 10న జరిగిందని తెలిపింది ఇండిగో. ఆ ప్రయాణీకుడు ఎవరో కాదు తమ పార్టీకి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అని జనవరి 18న ధ్రువీకరించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి .
ఇదిలా ఉండగా ఎంపీ చేసిన పనిని ప్రశ్నించాల్సింది పోయి వెనకేసుకు వస్తారా అని నెటిజన్లు మండి పడుతున్నారు మంత్రిపై.
Also Read : మోసానికి చిరునామా మోడీ సర్కార్