CM KCR : దేశమంతా ఉచిత కరెంట్..రైతు బంధు
పవర్ లోకి వస్తే చేస్తామన్న సీఎం కేసీఆర్
CM KCR : భారత రాష్ట్ర సమితి గనుక అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామని , ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్(CM KCR). భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ బుధవారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఉద్విగ్న భరితంగా ప్రసంగించారు.
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార దోలేందుకే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని చెప్పారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకు, సద్వినియోగం చేసుకునేందుకే తాము దీనిని ఏర్పాటు చేశామన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ సగర్వంగా బతికే హక్కు ఉందన్నారు సీఎం.
ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోడీ హయాంలో కోతలు, వాతలు తప్ప అభివృద్ది జాడ లేదన్నారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. లక్షల కోట్లు ఎవరి బొక్కల్లోకి వెళుతున్నాయో తెలియాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉందన్నారు సీఎం కేసీఆర్(CM KCR).
కేంద్రం కావాలని రాష్ట్రాల మధ్య కయ్యాలు పెడుతోందని ధ్వజమెత్తారు. దీంతో ఏ రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా లేదన్నారు. నీటి యుద్దాలు మళ్లీ మొదలయ్యాయని, కృష్ణా ట్రిబ్యునల్ ఇప్పటి వరకు తమ వాటా తేల్చలేదంటూ దీనికి కారణం కేంద్రమేనని ఆరోపించారు కేసీఆర్.
తమకు అధికారం అప్పగిస్తే ఐదేళ్లలో ఇంటింటికీ మంచి నీళ్లు అందజేస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
Also Read : దాడి దుమారం నా కొడుకు బంగారం