DGCA Slaps : టాటాకు షాక్ ఎయిర్ ఇండియాకు ఝలక్
రూ. 30 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
DGCA Slaps : వ్యాపార రంగంలో టాప్ లో కొనసాగుతోంది రతన్ టాటా సారథ్యంలోని టాటా గ్రూప్. ఒకనాడు తాము అమ్మేసిన ఎయిర్ ఇండియాను తిరిగి భారీ ఎత్తున ధరకు కొనుగోలు చేశారు రతన్ టాటా.
సింగపూర్ ఎయిర్ లైన్స్ ను కూడా ఇందులోనే కలిపేశారు. కానీ గత కొంత కాలంగా ఎయిర్ ఇండియా సేవల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనలు పూర్తిగా ఇబ్బందుల్లో పడేలే చేసింది.
ఇటీవల శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు ఓ వృద్దురాలిపై తాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అతడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానిపై ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీనిని సీరియస్ గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా(DGCA Slaps) విధించింది.
ఈ ఘటన న్యూయార్క్ – ఢిల్లీ ఫ్లైట్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి సదరు విమానాన్ని నడిపిన పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. అంతే కాకుండా విమానాల్లో సేవలను పరిరక్షించే డైరెక్టర్ కు రూ.3 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ.
ఇదిలా ఉండగా గత ఏడాది 2022 నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియాలో శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా సదరు వృద్దురాలు సిఇఓకు ఫిర్యాదు చేసింది. అతడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా శంకర్ మిశ్రాను తమ ఎయిర్ లైన్స్ లో నాలుగు నెలల పాటు ప్రయాణం చేయకుండా నిషేధం విధించింది.
Also Read : శంకర్ మిశ్రాపై నాలుగు నెలలు వేటు