Amazon Web Services : అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఖుష్ కబర్
స్వాగతించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Amazon Web Services : ప్రముఖ ఈకారమ్స్ అమెరికా దిగ్గజ సంస్థ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తన సంస్థకు సంబంధించి వెబ్ సర్వీసెస్ కోసం రూ. 36,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు(Amazon Web Services) వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రానికి ఇది శుభ సూచకమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ట్విట్టర్ వేదికగా స్వాగతించారు.
ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సారథ్యంలోని బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలు, కంపెనీలు, వ్యాపారవేత్తలు, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లతో ములాఖత్ అవుతున్నారు కేటీఆర్.
ఇదిలా ఉండగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. 2023 సంవత్సరం నాటికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిని దశల వారీగా ఖర్చు చేస్తూ వస్తోంది అమెజాన్ కంపెనీ.
ఇదిలా ఉండగా ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ లో అమెజాన్ వెల్లడించింది.
తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ గవర్నెన్స్ , హెల్త్ కేర్ , పురపాలికకు సంబంధించిన కార్యకలాపాలు, అవసరాలను మెరుగు పరిచేందుకు ఈ డేటా సెంటర్ మరింత ఉపయోగ పడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చందన్ వెల్లి, ఫార్మా సిటీ, ఎఫ్ఏబీ సిటీలో వీటిని పెట్టనుంది అమెజాన్(Amazon Web Services).
దీని వల్ల దేశంలోనే తెలంగాణ మరింత డేటా పరంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : గూగుల్ లో 12,000 మంది తొలగింపు