Chris Hipkins NZ PM : న్యూజిలాండ్ ప్ర‌ధానిగా క్రిస్ హిప్కిన్స్

జెసిండా ఆర్డెర్న్ రాజీనామాతో భర్తీ

Chris Hipkins NZ PM : న్యూజిలాండ్ నూత‌న ప్ర‌ధాన‌మంత్రిగా క్రిస్ హిప్కిన్స్ కొలువు తీర‌నున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్ర‌ధాన‌మంత్రిగా సేవ‌లు అందించిన జెసిండా ఆర్డెర్న్ ఫిబ్ర‌వ‌రి 7 వ‌ర‌కు ప‌ద‌వీ కాలం ఉన్నా ముందుగానే ఆమె త‌ప్పుకున్నారు.

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డంతో లేబ‌ర్ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీసింది. త‌న‌కు విశ్రాంతి కావాల‌ని అందుకే తాను ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు జెసిండా ఆర్డెర్న్.

ఇదిలా ఉండ‌గా క్రిస్ హిప్కిన్స్(Chris Hipkins NZ PM) న్యూజిలాండ్ లో కోవిడ్ కాలంలో మంత్రిగా ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆయ‌న త‌న ప‌నితీరుతో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌న‌లు పొందారు. లేబ‌ర్ పార్టీ కీల‌క సమావేశం నిర్వ‌హించింది. ఈ మేర‌కు ఒకే ఒక్క నామినేష‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి కోసం దాఖ‌లైంది.

దీంతో జెసిండా ఆర్డెర్న్ త‌ర్వాత క్రిస్ హిప్కిన్స్ కు మార్గం సుగ‌మ‌మైంది. పోటీలో ఎవ‌రూ లేక పోవ‌డంతో ప్ర‌ధానిగా ఆయ‌న నియామ‌కం దాదాపు ఖ‌రారు అయిన‌ట్టే.

దేశానికి సంబంధించి 41వ ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు 44 ఏళ్ల సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త అయిన క్రిస్ హిప్కిన్స్ కు జ‌న‌వ‌రి 22 ఆదివారం జ‌రిగే పార్ల‌మెంట్ లోని లేబ‌ర్ పార్టీ స‌భ్యులు అధికారికంగా మద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.

ప్ర‌స్తుతం పెరుగుతున్న ధ‌ర‌లు, పేద‌రికం , నేరాల రేటుపై ప్ర‌త్య‌ర్థి పార్టీలు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ త‌రుణంలో లేబ‌ర్ పార్టీ క్రిస్ హిప్కిన్స్ ను పీఎంగా ముందుకు తీసుకు వ‌చ్చింది.

Also Read : శ్రీ‌లంక ఆర్థిక పురోగ‌తికి భార‌త్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!