Rahul Gandhi Yatra : చలిని లెక్క చేయని రాహుల్
జమ్మూ కాశ్మీర్ లో పాద యాత్ర
Rahul Gandhi Yatra : భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి జమ్మూ కాశ్మీర్ లో సైతం ఊహించని రీతిలో ఆదరణ లభిస్తోంది. జనవరి 31న యాత్ర ముగింపు సభ కల్లోల కాశ్మీరంలో నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బేషరతుగా రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు.
మరో వైపు భారత ఆర్మీకి చెందిన సీనియర్లు, మాజీ ఉన్నతాధికారులు సైతం రాహుల్ యాత్ర(Rahul Gandhi Yatra)లో పాల్గొన్నారు. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలో మాజీ ఆర్మీ ఆఫీసర్లతో ప్రత్యేకంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు భేటీ అయ్యారు. ఇదే సమయంలో కెప్టెన్ బినా సింగ్ రాహుల్ తో జత కట్టడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇప్పటి వరకు రాహుల్ గాంధీ 140 రోజులు పూర్తయింది. 3,400 కిలోమీటర్లకు పైగా తన పాదయాత్రను చేపట్టారు. ఇంకా 378 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. సరిగ్గా పది రోజులు మాత్రమే ఉంది. ఓ వైపు వర్షం ఇంకో వైపు వణికిస్తున్న చలి. కానీ వీటిని ఏవీ పట్టించు కోవడం లేదు రాహుల్ గాంధీ.
ఆయన ఇప్పటి వరకు యాత్ర మొత్తంలో టీ షర్టుతో దర్శనం ఇచ్చారు. నిన్న ఒక్క రోజే భారీ ఎత్తున వర్షం రావడంతో జాకెట్ ధరించారు. చివరకు విప్పేశారు. ఆయనతో పాటు శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నాయకుడు జైరాం రమేష్ మాజీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు.
Also Read : దేశ రాజకీయాల్లో మార్పు ఖాయం