Jammu Narwal Blast : జమ్మూ నర్వాల్ లో జంట పేలుళ్లు
ఏడుగురికి తీవ్ర గాయాలు
Jammu Narwal Blast : జమ్మూ నగరంలోని నర్వాల్ ప్రాంతంలో జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. అన్ని రకాల వాహనాలను కలిగి ఉన్న వారు మరమ్మతులు, నిర్వహణ కోసం ఈ స్థలాన్ని సందర్శిస్తూ ఉంటారు. రోజంతా బిజీగా ఉండడం మామూలే.
ఇదిలా ఉండగా ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. నర్వాల్ ప్రాంతంలో పేలుళ్లు(Jammu Narwal Blast) జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇదిలా ఉండగా గాయపడిన వారిని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరీందర్ భటియాలీ స్పందించార. పేలుళ్లలో గాయపడిన ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో ఒకరి కడుపు భాగంలో తీవ్రంగా గాయమైందని , చికిత్స కొనసాగుతుందని చెప్పారు డాక్టర్. అంతకు ముందు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముఖేష్ సింగ్ మాట్లాడారు.
నర్వాల్ ప్రాంతంలో ఎక్కువగా టైర్లు, స్పేర్ పార్ట్స్ , జంక్ డీలర్లు, కారు పరికరాలకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్నాయని తెలిపారు. ట్రాన్స్ ఫోర్ట్ నగర్ లోని యార్డ్ నెంబర్ 7లో రెండు వాహనాల నుంచి పేలుళ్లు (Jammu Narwal Blast) సంభవించాయని , పేలుళ్ల జరిగిన తీరుపై విచారణ చేపట్టామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర , గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐదు రోజుల ముందు హై అలర్ట్ మధ్య పేలుళ్లు సంభవించడం విశేషం.
Also Read : చలిని లెక్క చేయని రాహుల్