Siddaramaiah : క‌న్న‌డ నాట కాంగ్రెస్ దే అధికారం – మాజీ సీఎం

న‌రేంద్ర మోదీ, అమిత్ షా వ‌చ్చినా ఏమీ కాదు

Siddaramaiah : క‌ర్ణాట‌క రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత సిద్ద‌రామ‌య్య(Siddaramaiah) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , జేపీ న‌డ్డా వ‌చ్చినా త‌మ విజ‌యాన్ని అడ్డుకోలేర‌న్నారు.

ఇవాళ కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు విసిగి పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా తాము భారీ సీట్ల‌ను కైవ‌సం చేసుకోవడం ఖాయ‌మ‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు బొమ్మై ప్ర‌భుత్వం కేరాఫ్ గా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు సిద్ద‌రామ‌య్య‌.

త‌మ పార్టీ 140 నుంచి 150 అసెంబ్లీ సీట్లు గెలుచు కోవ‌డం ఖాయ‌మ‌న్నారు మాజీ సీఎం. ఇదిలా ఉండ‌గా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను వ‌య‌స్సు రీత్యా ఈసారి బాదామి నుంచి పోటీ చేయ‌డం లేద‌ని, కోలార్ స్థానం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బాదామి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah).

ఇదిలా ఉండ‌గా 2018లో త‌న‌ను ఓడించాల‌ని ప్ర‌ధాని మోదీ, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా, జేపీ న‌డ్డా చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేశారని కానీ వాళ్లు ఓట‌మి పాల‌య్యార‌ని కానీ తాను విజ‌యం సాధించాన‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్య‌ర్థి బి. శ్రీ‌రాములుపై 1,700 ఓట్ల స్వ‌ల్ప ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బ‌స్సు యాత్ర చేప‌ట్టింది రాష్ట్రంలో.

Also Read : జ‌మ్మూ న‌ర్వాల్ లో జంట పేలుళ్లు

Leave A Reply

Your Email Id will not be published!