Kiren Rijiju : దేశ పరువును తగ్గించే ప్రయత్నం – రిజిజు
కేంద్ర న్యాయ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీజీపై బీబీసీ రెండు భాగాలుగా డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. జనవరి 17న టెలికాస్ట్ కావడం కలకలం రేపింది. ప్రధానంగా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో గోద్రా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనినే ఎక్కువగా ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన లింకులను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఫేస్ బుక్ , యూట్యూబ్ , లింక్డ్ ఇన్ , ఇన్ స్టా గ్రామ్ , ఇతర సామాజిక మాధ్యమాలలో ఏది షేర్ చేసినా వెంటనే నిలిపి వేయాలని స్పష్టం చేసింది.
దీంతో మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రాద్దాంతం చోటు చేసుకుంటున్న తరుణంలో బ్రిటన్ కు చెందిన ఎంపీ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ తరుణంలో ఆదివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) సీరియస్ గా స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు కావాలని భారత రాజ్యాంగం కంటే ఎక్కువ అని భావిస్తున్నారు. ఇంకొందరు ప్రధాన మంత్రి మోదీని, భారత దేశాన్ని తక్కువ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా మానసికంగా ఆనందానికి లోనవుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కిరెన్ రిజిజు.
Also Read : రాజ్యాంగాన్ని సుప్రీం హైజాక్ చేస్తోంది