HCU Modi BBC Documentary : హెచ్‌సియులో మోడీ బీబీసీ సీరీస్

కేసు న‌మోదు చేయ‌లేద‌న్న పోలీసులు

HCU Modi BBC Documentary : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే బీబీసీ మోడీపై రూపొందించిన డాక్యుమెంట‌రీపై నిషేధం విధించింది కేంద్ర ప్ర‌భుత్వం. దానికి సంబంధించిన లింకుల‌ను నిలిపి వేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

కేంద్ర స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని బేఖాత‌ర్ చేస్తూ హైద‌రాబాద్ విశ్వ విద్యాల‌యంలో(HCU Modi BBC Documentary) ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పై రూపొందించిన బీబీసీ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు.

దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే పోలీసులు మాత్రం కేసు న‌మోదు చేయ‌లేద‌ని స‌మాచారం. గ‌త వారం ప్రారంభంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీపై వివాదాస్ప‌ద‌మైన బీబీసీ డాక్యుమెంట‌రీ సీరీస్ ను భార‌త ప్ర‌భుత్వం ఖండించింది.

ఇది అప‌ఖ్యాతి పాలైన క‌థ‌నాన్ని ముందుకు తీసుకు రావ‌డానికి రూపొందించ‌బ‌డిన ప్ర‌చార భాగంగా అభివ‌ర్ణించింది. ఇక హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ ప్రాంగణంలో ప్ర‌ద‌ర్శించిన మోడీ సీరీస్ కు(HCU Modi BBC Documentary) 50 మందికి పైగా విద్యార్థులు హాజ‌రైన‌ట్లు స‌మాచారం. 

ఈ ప్ర‌దర్శ‌న‌ను స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్ఐఓ) , ముస్లిం స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఫ్రాటెర్నిటీ గ్రూప్ హైద‌రాబాద్ కేంద్ర విశ్వ విద్యాల‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంట‌రీని నిర్వ‌హించింది.

ఏబీవీపీ నేత మ‌హేష్ ఈ సంద‌ర్భంగా స్పందించాడు. ఈ విష‌యం గురించి యూనివ‌ర్శిటీ అధికారుల‌కు తెలియ చేశామ‌న్నారు. నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరామ‌ని చెప్పారు.

క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లో అనుమ‌తి లేకుండా బీబీసీ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించార‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా కొంద‌రు స్టూడెంట్స్ యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణంలో స్క్రీనింగ్ నిర్వ‌హించిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని , కానీ ఎటువంటి రాత పూర్వ‌కంగా ఫిర్యాదు అంద‌లేద‌న్నారు పోలీసులు. ఒక‌వేళ ఫిర్యాదు అందితే విచార‌ణ చేప‌డ‌తామ‌న్నారు.

Also Read : మోడీ బీబీసీ డాక్యుమెంట‌రీపై నో కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!