Sandeep Pathak : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ
సత్తా చాటుతామని ప్రకటన
Sandeep Pathak : ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. త్వరలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్(Sandeep Pathak) ప్రకటించారు. శాసనసభ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో కూడా బరిలో ఉంటామని చెప్పారు.
సందీప్ పాఠక్ ఆప్ కు సంబంధించి ఎంపీ మాత్రమే కాదు ఎన్నికల వ్యూహకర్తగా కూడా పేరొందారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎంపీ. ఎన్నికల వ్యూహకర్త, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సందీప్ పాఠక్ అధ్యక్షతన న్యూ ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
ఈ మీటింగ్ లో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీతో పాటు గులాం నబీ ఆజాద్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు కూడా కొలువు తీరాయి. ఈసారి భారీ ఎత్తున పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. ఇక ఈ కీలక సమావేశంలో జమ్మూ కాశ్మీర్ కు ఇప్పటికే నియమితులైన ఆప్ ఇన్నికల ఇన్ ఛార్జ్ ఇమ్రాన్ హుస్సేన్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన పార్టీ యూనిట్ ఆఫీస్ బేరర్లు కూడా పాల్గొన్నారు.
తమ పార్టీ పూర్తి శక్తి కలిగి ఉంది. తదుపరి జరగబోయే ఎన్నికలపైనే ఆప్ ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు సందీప్ పాఠక్(Sandeep Pathak) . ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ సందర్భంగా ఆప్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సందీప్ పాఠక్ కోరారు.
Also Read : జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలి