Rahul Gandhi Yatra : విద్వేష రాజ‌కీయం దేశానికి ప్ర‌మాదం

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Yatra : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్వేష రాజ‌కీయాలు దేశానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ఎపీ, భ‌జ‌రంగ్ ద‌ళ్, ఏబీవీపీ , త‌దిత‌ర కాషాయ సంస్థ‌ల‌న్నీ ఇవాళ కులం, ప్రాంతం , మ‌తం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర(Rahul Gandhi Yatra) బుధ‌వారం జ‌మ్మూ కాశ్మీర్ లో కొన‌సాగుతోంది.

పాద‌యాత్ర‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇలా ఎంత కాలం మ‌నుషుల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొడ‌తార‌ని ప్ర‌శ్నించారు. దేశానికి కావాల్సింది ద్వేషం కాద‌ని కాసింత ప్రేమ కావాల‌ని అన్నారు. ఏదో ఒక రోజు ఈ దేశం తాను చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్ముతుంద‌ని, ఆరోజు త్వ‌ర‌లోనే వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.

ఇవాళ ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్న వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేస్తూ వ‌చ్చిన ఘ‌న‌త కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా కొద్ది మందికే కేటాయిస్తూ పోతే చివ‌ర‌కు దేశంలో ఏం మిగులుతుంద‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం ప్ర‌జ‌లు మాత్ర‌మే మిగులుతార‌ని వాళ్ల‌ను కూడా అమ్మేస్తారా అంటూ నిల‌దీశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra).

ఇదిలా ఉండ‌గా ఆయ‌న చేప‌ట్టిన యాత్ర 3,500 కిలోమీట్ల‌ను దాటేసింది. ఈ నెలాఖ‌రున జ‌మ్మూలో భార‌త్ జోడో యాత్ర ముగుస్తుంది. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీపై సాక్షి మాలిక్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!