Padma Awards 2023 List : పద్మ అవార్డులు పొందింది వీరే
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Padma Awards 2023 List : కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను 2022 సంవత్సరానికి గాను ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఓఆర్ఎస్ సృష్టకర్త దిలీప్ కుమార్ , సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ములాయం , కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, జాకీర్ హుస్సేన్ లు ఉన్నారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ భూషణ్ , ముగ్గురికి పద్మశ్రీ వరించింది. చిన్న జీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్ కు పద్మభూషణ్ పురస్కారం దక్కింద.ఇ విజయ్ గుప్తా, హనుమంతరావు పసుపులేటి, రామకృష్ణా రెడ్డికి పద్మశ్రీ దక్కింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి(Padma Awards 2023 List) .
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గనేష్ నాగప్ప, కృష్ణ రాజ నగర్ , సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వర్ రావు, కోటా సచ్చితానంద , ప్రకాష్ చంద్ర సూద్ , చంద్రశేఖర్ లకు పద్మశ్రీలు వరించాయి. ఇక బాల కృష్ణ దోషి , జాకీర్ హుస్సేన్ , ఎస్ఎం కృష్ణ , దిలీప్ కుమార్ , శ్రీనివాస్ వరదాన్ , ములాయం సింగ్ యాదవ్ లకు పద్మ విభూషణ్ లభించింది. ఆరుగురికి దక్కింది.
ఇక పద్మ భూషణ్ అవార్డు 9 మందికి దక్కాయి. ఎస్ ఎల్ బైరప్ప, కుమార మంగళం బిర్లా, దీపక్ ధార్ , వాణి జయరాం , చిన్న జీయర్ స్వామి, సుమన్ కళ్యాణ్ పూర్ , కపిల్ కపూర్ , సుధా మూర్తి, కమేలేష్ డి పటేల్ కు దక్కాయి.
ఇక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో సుకమ ఆచార్య, జోధియా బాయ్ బైగా, ప్రేమ్ జీత్ బారియా, ఉషా బార్లే, మునీశ్వర్ చందర్ దావర్ , హేమంత్ చౌహాన్ , భాను బాయ్ చైతరా, హేమోప్రోవ ఛటియా, నరేంద్ర చంద్ర దెబ్బర్మ, సుభద్రాదేవి, ఖాదర్ వలి దూదేకుల, హేమచంద్ర గోస్వామి, రాధా చరణ్ గుప్తా , విజయ గుప్తా, అహ్మద్ , మహ్మద్ హుస్సేన్ , దిల్షాద్ హుస్సేన్ , చంద్రాకర్ , హీరా బాయి లోబి, రామ్కుయివాంఘ్బే , వీపీ అప్పకుట్టన్ , చంద్రశేఖర్ , అఫ్రడబుల్ హెల్త్ కేర్ , పడివేల్ గోపాల్ , మసి సదాయ్యన్ కు దక్కాయి.
వీరితో పాటు తుల రామ్ ఉప్రెటి, నెక్రమ్ శర్మ, జనుమ్ సింగరాయ్ , ధనీరరామ్ టోటో , బి. రామకృష్ణా రెడ్డి, అజయ్ కుమార్ మాండవి, రాణి మచ్చయ్య, కేసీ రున్రెంసంగి, రిసంగ బోర్ కుర్కలాంగ్ , మంగళ కాంతి రాయ్ , మోవా సుబంగ్ , ముని వెంకటప్ప, దోమర్ సింగ్ కున్వార్ , పరశురామ్ కొమాజిఖునె, గులాం మహ్మద్ జాజ్ , పరేశ్ రాథ్వా , కపిల్ దేవ్ ప్రసాద్ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.
Also Read : ఈ పురస్కారం తండ్రికి అంకితం