Congress Jabalpur Case : కాంగ్రెస్ నేత కామెంట్స్ క‌ల‌క‌లం

అవినీతికి పాల్ప‌డితే చేతులు తీయండి

Congress Jabalpur Case : మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కుడు (Congress Jabalpur Case) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. అవినీతికి ఎవ‌రు పాల్ప‌డిన వారి చేతులు తీసి వేయండి అని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌భుత్వం అవినీతి, అక్ర‌మాల‌కు తెర లేపింద‌ని ఆరోపించారు స‌ద‌రు నాయ‌కుడు.

రాష్ట్రంలో పాల‌న పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని, జ‌వాబుదారీత‌నం లోపించింద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలోని జ‌బ‌ల్ పూర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు నీలేష్ జైన్ పై భార‌తీయ శిక్షా స్మృతి ప్ర‌కారం రెండు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఈ మేర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ చేసిన ఫిర్యాదు మేర‌కు తాము కేసు న‌మోదు చేశామ‌న్నారు.

ప్ర‌జ‌ల మాట విన‌కుంటే అవినీతిప‌రుల చేతులు విరిచి వేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో అల‌ర్ట్ అయ్యారు పోలీసులు. ఇది పూర్తిగా అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు అంటూ మండిప‌డ్డారు బీజేపీ నాయ‌కులు. జ‌బ‌ల్ పూర్ జిల్లా భార‌తీయ జ‌న‌తా పార్టీ యువ మోర్చా అధ్య‌క్షురాలు రాజ‌మ‌ణి సింగ్ ఫిర్యాదు చేయడంతో వివాదం మ‌రింత ముదిరింది.

ఈ మేర‌కు షాపురా పోలీస్ స్టేష‌న్ పోలీస్ ఆఫీస‌ర్ ఎస్ఎల్ వ‌ర్మ ఈ విష‌యాన్ని జాతీయ మీడియాకు వెళ్ల‌డించారు. చేతులు మ‌డ‌వండి..లేక‌పోతే తీయండి..విర‌గ్గొట్టండి అంటూ పిలుపునిచ్చార‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ జ‌న‌వ‌రి 26న దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అనే పేరుతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. దీనిపై ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పందించ లేదు.

Also Read : గుజ్జ‌ర్’ ను సంద‌ర్శించ‌నున్న మోడీ

Leave A Reply

Your Email Id will not be published!