Justice Bobde : అధికార భాషగా సంస్కృతం ఉంటే తప్పేంటి
జస్టిస్ బాబ్డే సంచలన కామెంట్స్
Justice Bobde : మాజీ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వం ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి , ఒకే దేశం , ఒకే కల్చర్ ఉండాలని చూస్తోంది. ఇందులో భాగంగా దేశమంతటా హిందీని రుద్దేందుకు యత్నిస్తోంది.
దీనిని దేశంలోని చాలా రాష్ట్రాలు ఒప్పు కోవడం లేదు. ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ తరుణంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో సంస్కృత భాష అధికార భాషగా ఎందుకు ఉండ కూడదని ప్రశ్నించారు జస్టిస్ బాబ్డేJustice Bobde).
1949 నుండి మీడియా నివేదికల ప్రకారం రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా దీనిని ప్రతిపాదించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాగ్ పూర్ లో సంస్కృత భారతి నిర్వహించిన అఖిల భారత ఛత్ర సమ్మేళన్ లో జస్టిస్ శరద్ బాబ్డే , రామ జన్మ భూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు.
చట్టం ప్రకారం పాలన , న్యాయ స్థానాలలో హిందీ, ఇంగ్లీష్ అధికారిక భాషలుగా ఉపయోగించ బడుతున్నాయని అన్నారు జస్టిస్ బాబ్డే. అయితే ప్రతి ప్రధాన న్యాయమూర్తి సంబంధిత ప్రాంతీయ భాషలను ప్రవేశ పెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రాతినిధ్యాలను స్వీకరిస్తారని చెప్పారు.
హైకోర్టు స్థాయిలో అధికార భాష ఇంగ్లీష్ అని చాలా హైకోర్టులలో ప్రాంతీయ భాషలలో దరఖాస్తులు, పిటిషన్లు , పత్రాలను కూడా అనుమతించాల్సి ఉంటుందన్నారు బాబ్డే(Justice Bobde). సంస్కృత పద జాలం మన చాలా భాషలకు ఆధారంగా ఉందన్నారు. 95 శాతం భాషకు ఏ మతంతో సంబంధం లేదన్నారు.
Also Read : మోడీ సర్కార్ డేంజర్ – అమర్త్య సేన్