Anurag Thakur : ఆప్ సర్కార్ అవినీతికి కేరాఫ్ – ఠాకూర్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్స్
Anurag Thakur : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. ఆయన ఢిల్లీలో కొలువు తీరిన ఆప్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అవినీతి, అక్రమాలకు ఆప్ కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ,కాలుష్యంపై పోరాటానికి రూ. 1 లక్ష కోట్లకు పైగా అభివృద్ధి పనులకు వెచ్చించిందని చెప్పారు ఠాకూర్. పారదర్శకంగా ఉండాల్సిన ఆప్ ప్రభుత్వం పక్కా అవినీతికి అడ్డగా మారి పోయిందన్నారు.
అందుకే ప్రజలకు వాస్తవాలను తెలియ చేసేందుకు భారతీయ జనతా పార్టీ అడుగడుగునా పోరాడుతోందని చెప్పారు. ఆప్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను బట్ట బయలు చేసిందని అన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) . ఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్ ను గద్దె దించేందుకు కొత్తగా తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే 2024 లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి తిరుగు ఉండదన్నారు కేంద్ర మంత్రి. అరవింద్ కేజ్రీవాల్ తానేదో గొప్ప నాయకుడినని తనకు తానుగా ఊహించుకుంటాడని కానీ ఆయనకు అంత సీన్ లేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా బాకాలు ఊదే ఆప్ తానే అవినీతికి కేరాఫ్ గా మారడం దారుణమన్నారు అనురాగ్ ఠాకూర్.
వాయు కాలుష్యంపై పోరాడేందుకు కేంద్ర సర్కార్ ఫేమ్ పథకం కింద ఢిల్లీ కి 150 విద్యుత్ బస్సులను ఇచ్చిందన్నారు. కానీ ఇది తామే కొనుగోలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు ఠాకూర్(Anurag Thakur) .
Also Read : చద్దాకు యుకే అచీవర్స్ అవార్డు