Amrit Udyan : మొఘ‌ల్ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్

కొత్త పేరు పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వం

Amrit Udyan : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం అన్నీ మార్చేసుకుంటూ పోతోంది. ఒకే భాష‌, ఒకే పార్టీ, ఒకే మ‌తం, ఒకే దేశం, ఒక కులం ఉండాల‌ని కోరుకుంటోంది. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది కేంద్రం. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లోని మొఘ‌ల్ గార్డెన్స్ పేరును మార్చేసింది. దానికి అమృత్ ఉద్యాన్ అనే కొత్త‌గా పేరు(Amrit Udyan) పెట్టింది.

ఈ సంద‌ర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార ప్ర‌తినిధి సంబిత్ పాత్ర న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించారు. ఇది భార‌త దేశ చ‌రిత్ర‌లో క‌ల‌క‌లం నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు. అమృత్ క‌ల్ (స్వ‌ర్ణ యుగం ) లో బానిస మ‌న‌స్త‌త్వం నుండి బ‌య‌ట‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాష్ట్ర ప‌తి భ‌వ‌న్ లోని ఐకానిక్ గార్డెన్ ల‌ను మొఘ‌ల్ గార్డెన్స్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం దీనిని అమృత్ ఉద్యాన్(Amrit Udyan) అని పిలుస్తారు. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆజాదీ కా అమృత్ ఉత్స‌వాల్లో భాగంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఈ కొత్త పేరును పెట్టిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీ న‌వికా గుప్తా వెల్ల‌డించారు.

శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు తెలిపారు. ఆదివారం ప్ర‌జ‌ల కోసం తెరిచి ఉంచుతామ‌ని , జ‌న‌వ‌రి 31 నుండి మార్చి 26 వ‌ర‌కు దాదాపు 2 నెల‌ల పాటు తెరిచి ఉంచుతామ‌ని ఆమె వెల్ల‌డించింది. విక‌లాంగులు, రైతులు, మ‌హిళ‌లు పాల్గొనాల‌ని కోరారు.

Also Read : క‌మలం గుజ్జ‌ర్ల‌తో శాశ్వ‌త బంధం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!