Rahul Gandhi Tribute : అమ‌ర వీరుల‌కు రాహుల్ నివాళి

కొనసాగుతున్న భార‌త్ జోడో యాత్ర‌

Rahul Gandhi Tribute : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమ‌ర వీరుల‌కు నివాళులు అర్పించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ. శ‌నివారం కాశ్మీర్ లో భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్ర‌లో మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ , ఆమె కూత‌రుతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో క‌లిసి అడుగులో అడుగులు వేశారు.

యాత్ర‌తో జ‌త‌క‌ట్టారు. శుక్ర‌వారం నాటి భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌లు, నిర్వ‌హ‌ణ లోపం ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు మూడంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ద‌క్షిణ కాశ్మీర్ లోని చెర్సూ అవంతి పొర స‌మీపంలో రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు.

శ్రీ‌నగ‌ర్ శివారు లోని పాంపోర్ కు యాత్ర చేరుకుంది. ఇదిలా ఉండ‌గా 2019 పుల్వామా ఆత్మాహుతి కారు బాంబు పేలుళ్ల‌లో మ‌ర‌ణించిన 40 మంది సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ ) జ‌వాన్ల‌కు రాహుల్ గాంధీ పూల‌మాల‌లు వేసి నివాళులు(Rahul Gandhi Tribute) అర్పించారు.

జ‌మ్మూ శ్రీ‌న‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారి వెంట జైషే మ‌హ్మ‌ద్ ఆత్మాహుతి దాడి చేసిన సీఆర్పీఎస్ బ‌స్సును పేల్చి వేసిన ప్ర‌దేశంలో పుష్ప గుచ్ఛం ఉంచారు.

జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు , ఆర్మీ కి చెందిన బ‌ల‌గాలు అమ‌రుల‌కు నివాలులు అర్పించారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు మూడెంచ‌ల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జ‌మ్మూ కాశ్మీర్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు.

Also Read : మొఘ‌ల్ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్

Leave A Reply

Your Email Id will not be published!