TTD New Mobile APP : శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త

అందుబాటులోకి న్యూ యాప్

TTD New Mobile APP : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ల‌ను కొలుస్తారు. నిత్యం శ్రీ‌నివాసుడిని జ‌పిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా భావిస్తారు భ‌క్త‌జ‌నం. లెక్కించ లేనంత ఆదాయం, లెక్క‌కు మించిన బంగారం, బ‌హుమ‌తులు స్వామి వారి చెంత‌కు చేరుతూనే ఉన్నాయి. భార‌త దేశంలోనే అత్యంత ధ‌నిక‌మైన ఆల‌యాల‌లో తిరుమ‌ల ఒక‌టి.

రోజు రోజుకు తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఎవ‌రికీ ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. అయినా ఉత్స‌వాలు, ప్ర‌త్యేక పండుగ‌ల సంద‌ర్భంలో భారీ ఎత్తున పుణ్య క్షేత్రాన్ని ద‌ర్శించుకుంటారు. సెల‌వు రోజుల్లో అయితే చెప్ప‌లేనంత భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సాధ్య‌మైనంత మేర‌కు సామాన్యుల‌కు స్వామి వారి ద‌ర్శ‌నం క‌లిగేలా చూస్తోంది టీటీడీ.

ఇందులో భాగంగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త‌గా తిరుమ‌ల‌కు సంబంధించి యాప్ ను తీసుకు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. దీనిని రిల‌య‌న్స్ జియో సంస్థ ఉచితంగా అందించింద‌ని చెప్పారు. ఈ యాప్(TTD New Mobile APP) ద్వారా వ‌ర్చువ‌ల్ గా స్వామి వారి సేవ‌ల‌ను భ‌క్తులు వీక్షించేందుకు ఛాన్స్ ఉంద‌న్నారు.

టీటీడీ మొబైల్ యాప్ ను జ‌న‌వ‌రి 29 ఆదివారం నుంచే గూగుల్ స్టోర్ యాపిల్ వెర్ష‌న్ లో అందుబాటులోకి వ‌స్తుద‌ని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఇందులో టీటీడీ సేవ‌లు, స‌మ‌స్త స‌మాచారం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీని ఖ‌ర్చు రూ. 20 కోట్లు అయ్యింద‌ని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు , సేవ‌లు, వ‌స‌తి గృహాల‌ను బుక్ చేసుకోవ‌చ్చని తెలిపారు.

Also Read : అమ‌ర వీరుల‌కు రాహుల్ నివాళి

Leave A Reply

Your Email Id will not be published!