BRS Maharashtra Meeting : మ‌రాఠాలో స‌భ బీఆర్ఎస్ పాగా

ఫిబ్ర‌వ‌రి 5న బ‌హిరంగ స‌భ

BRS Maharashtra Meeting : తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చిన త‌ర్వాత ఆ పార్టీ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా విస్త‌రించే ప‌నిలో పడ్డారు. ఏపీలో ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీకి తోట చంద్ర‌శేఖ‌ర్ ను నియ‌మించారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ , త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక యూపీలో రైతు అగ్ర నాయ‌కులు రాకేశ్ టికాయ‌త్ పార్టీలో చేరారు. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ఈ ఏడాది చివ‌ర‌లో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మాజీ సీఎం కుమార‌స్వామి బీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ ఇరు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయా అన్న‌ది తేలాల్సి ఉంది.

ఢిల్లీలో , పంజాబ్ లో ఆప్ తో పాటు క‌లిసి భార‌త రాష్ట్ర స‌మితి క‌లిసి ముందుకు సాగుతుంద‌ని అంచ‌నా. దేశంలో 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పోటీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు సీఎం కేసీఆర్.

ఇప్ప‌టికే ఖ‌మ్మంలో భారీ ఎత్తున బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఇందులో భాగంగా భార‌త రాష్ట్ర స‌మితిని మ‌రాఠాలో కూడా విస్త‌రించాల‌ని ప్లాన్ చేశారు కేసీఆర్. ఈ మేర‌కు ఫిబ్ర‌వ‌రి 5న బీఆర్ఎస్(BRS Maharashtra Meeting) ఆధ్వ‌ర్యంలో స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా నిమ‌గ్న‌మైంది బీఆర్ఎస్ .

కేశ‌వ‌రావు, మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు మ‌హారాష్ట్ర‌కు చేరుకున్నారు. మ‌రాఠాకు చెందిన వివిధ పార్టీల నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ద‌మ్ముందా

Leave A Reply

Your Email Id will not be published!