Rahul Gandhi Salute : మేరా భారత్ మహాన్ – రాహుల్ గాంధీ
జాతీయ పతాకానికి కాంగ్రెస్ నేత సలాం
Rahul Gandhi Salute : కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మేరా భారత్ మహాన్ అంటూ నినదించారు. సమున్నత భారతావని గర్వించేలా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాకు సలాం చేశారు. నా దేశం గొప్పదని, అన్ని మతాలు, కులాలు, భాషలకు చెందిన వారంతా భారతీయులేనని స్పష్టం చేశారు.
ఈ దేశానికి కావాల్సింది ద్వేషం కాదని ప్రేమ కావాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi Salute) చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కల్లోల జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోంది. భారీ ఎత్తున జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఓ వైపు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన తన భారత్ జోడో యాత్రను కొనసాగించారు.
ఇదిలా ఉండగా జనవరి 30తో ఆయన పాదయాత్ర ముగియనుంది. శ్రీననగర్ లోని లాల్ చౌక్ లోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన తో పాటు సోదరి , కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ సన్నివేశం జాతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని స్పష్టం చేశారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్.
ఇదిలా ఉండగా 10 నిమిషాల కార్యక్రమంలో లాల్ చౌక్ కు వెళ్లే అన్ని రహదారులను శనివారం రాత్రి నుండి మూసి వేశారు పోలీసులు. వాహనాల రాకపోకలకు కూడా అనుమతి ఇవ్వలేదు.
Also Read : లడఖ్ కోసం సోనమ్ వాంగ్ చుక్ దీక్ష