MK Stalin : మోదీ బీబీసీ..అదానీపై నిల‌దీయండి – సీఎం

డీఎంకే ఎంపీల‌కు ఎంకే స్టాలిన్ దిశా నిర్దేశం

MK Stalin : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది బీబీసీ మోదీ పై తీసిన డాక్యుమెంట‌రీ. దీనిని నిషేధించింది కేంద్ర ప్ర‌భుత్వం. మ‌రో వైపు దేశానికి చెందిన ప్ర‌భుత్వ ఆధీనంలోని ఎల్ఐసీ, ఎస్బీఐ కి చెందిన కోట్లాది రూపాయ‌లు అదానీ గ్రూప్ కంపెనీల‌లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేశాయి.

అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ కొట్టిన దెబ్బ‌కు అదానీ గ్రూప్ కు చెందిన షేర్లు ప‌డి పోయాయి. ఈ త‌రుణంలో డీఎంకేకు చెందిన ఎంపీలు మోదీ బీబీసీ డాక్యుమెంట‌రీ, అదానీ వ్య‌వ‌హారంపై నిల‌దీయాల‌ని, మోదీ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేయాల‌ని పిలుపునిచ్చారు ఎంకే స్టాలిన్(MK Stalin).

దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన స‌మస్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వం 2023-24 ఆర్థిక నివేదిక‌, రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ఎంపీల‌తో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన మీటింగ్ లో కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

2002 లో జ‌రిగిన గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై బీబీసీ డాక్యుమెంట‌రీ, అదానీ గ్రూప్ కు చెందిన ఆరోప‌ణ‌ల‌పై స‌భ్యులు బ‌లంగా ప్ర‌శ్న‌లు సంధించాల‌ని ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. భార‌త రాజ్యాంగం ప్రాథ‌మిక నిర్మాణాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ఉప రాష్ట్ర‌ప‌తితో స‌హా కొంత మంది వ్య‌క్తుల కామెంట్స్ కు వ్యతిరేకంగా బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని కోరారు సీఎం(MK Stalin).

గ‌వ‌ర్న‌ర్ వ్య‌హారం, నీట్ వ్య‌తిరేక బిల్లుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం, త‌మిళ మ‌త్స్య‌కారుల‌పై శ్రీ‌లంక నేవీ దాడి, మ‌దురైలో ఎయిమ్స్ నిర్మాణం, సేతు స‌ముద్రం ప్రాజెక్టుపై ఆమోదం కోసం నిల‌దీయాల‌ని కోరారు ఎంకే స్టాలిన్.

Also Read : అదానీ గ్రూప్ లాస్ ఎల్ఐసీకి షాక్

Leave A Reply

Your Email Id will not be published!