Supreme Court Modi BBC : మోదీ బీబీసీ నిషేధంపై విచారణ
వచ్చే సోమవారం వాదనలు కోర్టులో
Supreme Court Modi BBC : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది మోదీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది.
సోషల్ మీడియలో దానికి సంబంధించిన లింకులు పూర్తిగా తొలగించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బీబీసీ సీరీస్ ను ఈ సందర్బంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
మోదీ బీబీసీ సీరీస్ పై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్(Supreme Court Modi BBC) దాఖలైంది. దీనిపై విచారణకు స్వీకరించింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం. దీనికి సంబంధించి వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక దాఖలైన పిటిషన్ లో రెండు భాగాల డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడం దుర్మార్గం, ఏకపక్షం , పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని ఎంఎల్ శర్మ ఆరోపించారు.
డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు విద్యార్థులను యూనివర్శిటీల నుండి సస్పెండ్ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని పిటిషనర్ ప్రశ్నించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్న మోదీని ప్రశ్నించడం తట్టుకోలేక పోతున్నారంటూ కాషాయ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2002 గుజరాత్ అల్లర్లు , హింసలో ప్రధాని మోదీ పాత్రాపై ఆరోపించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం వచ్చే వారం విచారించనున్నట్లు ప్రకటించింది.
Also Read : అఖిలపక్షంతో కేంద్రం కీలక భేటీ