Nitish Kumar : బీజేపీ కుట్ర నిజం నితీశ్ ఆగ్రహం
చావనైనా చస్తా కానీ పొత్తు పెట్టుకోను
Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఆయన బీహార్ లో భారతీయ జనతా పార్టీతో కలిసి 17 ఏళ్ల పాటు మైత్రీ బంధాన్ని కొనసాగించారు. ఇటీవల కాషాయానికి చెక్ పెట్టారు. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మహాఘట్ బంధన్ పేరుతో కొత్త సర్కార్ ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజా పరివర్తన్ పేరుతో ముందుకు వెళుతున్నారు. నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను కొన ఊపిరితో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం.
ఇప్పటి వరకు తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తన రాజకీయ అనుభవం ముందు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వ్యూహాలు, కుట్రలు పని చేయవని హెచ్చరించారు. ఇప్పటికీ తమ బంధాన్ని చెరిపి వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు సీఎం.
ఆర్జేడీ అగ్ర నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ పై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అయినా నిజం త్వరలోనే తేలుతుందన్నారు. ఎంత సేపు ప్రాంతం, కులం, మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు సహించరన్నారు. లాలూ, తేజస్విపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar).
వీళ్లను వేధింపులకు గురి చేస్తే తిరిగి వారి వద్దకు తాను వెళతానని అనుకుంటున్నారని కానీ బీజేపీకి అంత సీన్ లేదన్నారు సీఎం. బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
Also Read : ఎస్పీ..బీజేపీపై మాయావతి ఫైర్