TS Gurukul Jobs : త్వరలో పంతుళ్ల భర్తీకి పచ్చజెండా
గురుకులాల్లో ఇక ఖాళీల భర్తీకి నిర్ణయం
TS Gurukul Jobs : రాష్ట్రంలో గత కొంత కాలంగా కొలువుల జాతర కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కరికి కూడా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు.
మరో వైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు గాను కేసీఆర్ తెలివిగా జాబ్స్ ను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ఎలాంటి కీలకమైన శాఖల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికల్లా యువత ఆందోళనలు, నిరసనలు చేయకుండా ఉండేందుకు నోటిఫికేషన్ల జారీతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను(TS Gurukul Jobs) భర్తీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 11,105 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా ఆయా గురుకులాల బోర్డులే వీటిని నియమించనున్నాయి.
పీఈటీ, పీడీ , ఇతర పోస్టులలో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. వీటిని వదిలి వేసి టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఈ వారంలోనే 6 వేలకు పైగా ముందస్తుగా వేయనున్నారు. మొత్తంగా 2023-2024 విద్యా సంవత్సరంలోనే టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది.
Also Read : మరికొన్ని పట్టణాల్లో జియో 5జీ సేవలు