Nirmala Sitharaman : నీతి ఆయోగ్ మూడేళ్ల పాటు పొడిగింపు

ప్ర‌క‌టించిన నిర్మ‌లా సీతారామన్

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నీతి ఆయోగ్ మూడేళ్ల పాటు పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బుధ‌వారం కేంద్ర బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. కీల‌క‌మైన నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్ . కానీ సామాన్యుల‌కు ప్ర‌యారిటీ మాత్రం ఇవ్వ‌లేదు.

ఇది పూర్తిగా వ్యాపార‌వేత్త‌ల‌కు అనుకూలంగా మేలు చేకూర్చేలా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ లో కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గించాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ వాహ‌నాలు మార్చేందుకు ప్ర‌త్యేక నిధులు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొత్త వాహ‌నాల కొనుగ‌గోలుకు సంబంధించి రాష్ట్రాల‌కు కూడా సాయం చేస్తామ‌ని తెలిపారు.

ఇక రైతుల‌కు రూ. 20 ల‌క్ష‌ల కోట్లు వ్య‌వ‌సాయ రుణాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా కొత్త‌గా ఇళ్లు కొనుగోలు చేయాల‌ని అనుకునే వారికి తీపిక‌బురు చెప్పింది. గ‌తంలో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ కు రూ. 48 వేల కోట్లు కేటాయిస్తే ఈసారి 2023 బ‌డ్జెట్ లో రూ. 79 వేల కోట్లు కేటాయించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ నిధుల‌ను పీఎం ఆవాజ్ యోజ‌న కింద కేటాయిస్తామ‌న్నారు. ఎప్ప‌టి లాగే రాష్ట్రాల‌కు వ‌డ్డీ లేని రుణాల ప‌థకం మ‌రో ఏడాది పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు నిర్మలా సీతారామ‌న్(Nirmala Sitharaman). ఇందు కోసం 13.7 ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా చేప‌ట్టే రైల్వే ల‌కు భారీగా నిధులు ఇస్తామ‌న్నారు. మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య బ‌డుల్లో టీచ‌ర్ల‌ను నియ‌మిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : సీనియ‌ర్ సిటిజన్ల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!