Union Budget 2023 : వ్యవసాయ రంగానికి రుణ సాయం
కేంద్ర బడ్జెట్ 2023లో పెద్ద పీట
Union Budget 2023 : గత కొంత కాలంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తోందన్న అపప్రదను తొలగించేందుకు ప్రస్తుత బడ్జెట్ లో కేటాయింపునకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. బుధవారం పార్లమెంట్ లో దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తంగా ఏడు అంశాలకు ప్రాధాన్యత(Union Budget 2023) ఇచ్చామని చెప్పారు.
వ్యవసాయ రంగానికి రూ. 20 వేల కోట్లు రుణ సాయంగా అందజేయనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి అంకురాలకు చేయూత ఇస్తున్నట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు సూచించే స్టార్టప్ లకు సాయం చేస్తామన్నారు.
ఇందు కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. పత్తి సాగు పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. అంతే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ క్లీన్ పథకం ద్వారా ఉద్యానవన పంట పండించేందుకు సహకారం అందజేస్తామని చెప్పారు.
ఇందులో భాగంగా చిరు ధాన్యాల పంటలకు సాయం చేస్తామని తెలిపారు. ఇందు కోసం శ్రీ అన్న పథకం ప్రవేశ పెట్టామన్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు , కందులు, మినుము, తదితర పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు.
మరో వైపు స్వచ్ఛ భారత్ లో భాగంగా రూ. 11. 7 కోట్లతో టాయ్ లెట్స్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందని తెలిపారు. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షలకోట్లను కేంద్రం భరిస్తోందని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.
Also Read : ఏకలవ్య బడుల్లో పంతుళ్ల భర్తీ – నిర్మలా