Arvind Kejriwal Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం
అరవింద్ కేజ్రీవాల్ కొత్త పేరు
Arvind Kejriwal Liquor Scam : దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కలకలం రేపింది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు కీలకంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. వెలుగులోకి ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను చేర్చింది. ఆయన నివాసాలపై సోదాలు చేపట్టింది. కేసు నమోదు చేసింది.
తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Liquor Scam) పేరును కూడా చేర్చింది. ఆయనకు కూడా ప్రమేయం ఉందని పేర్కొంది. మద్యం కేసులో కొత్తగా సీఎంపై అభియోగం మోపింది. తాజాగా సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఆప్ చీఫ్ పేరును చేర్చింది. ప్రస్తుతం ఆప్ లో కలకలం రేపుతోంది ఈ వ్యవహారం.
ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో తన ప్రచారానికి మద్యం కుంభకోణం నుండి వచ్చిన డబ్బును ఉపయోగించారంటూ ఆరోపించింది ఈడీ. వ్యాపారవేత్తతో కేజ్రీవాల్ కాల్ రికార్డ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ ఛార్జ్ విజయ్ నాయర్ , ఇండో స్పిరిట్స్ చీఫ్ సమీర్ మహేంద్రు , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య తన ఫోన్ నుండి ఫేస్ టైమ్ వీడియో కాల్ ఏర్పాటు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
ఢిల్లీ మద్యం పాలసీలో లైసెన్సుల కోసం అడ్వాన్సుగా సౌత్ గ్రూప్ నుండి రూ. 100 కోట్లు అందుకున్నారని ఏజెన్సీ ఆరోపించింది.
Also Read : సీఎంకు యూనివర్శిటీ షాక్