Mamata Banerjee : కొందరి కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్
సీఎం మమతా బెనర్జీ కామెంట్స్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కేంద్ర బడ్జెట్ ఎవరికీ ఉపయోగం లేకుండా ఉందని ఆరోపించారు. కేవలం కొందరి వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల కోసం మాత్రం రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. ఒక రకంగా ఎద్దేవా చేశారు సీఎం.
భారత దేశంలో కీలకమైన ప్రభుత్వ సంస్థలుగా ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కు చెందిన కోట్లాది రూపాయలను అదానీ గ్రూపు లో ఇన్వెస్ట్ చేశాయి. తాజాగా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ కొట్టిన దెబ్బకు అదానీకి చెందిన షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి.
ఈ సందర్బంగా టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఎల్ఐసీ, ఎస్బీఐ సొమ్మును కొందరు నేతలకు లబ్ది చేకూర్చేందుకు బీజేపీ సర్కార్ యత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు సీఎం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ను తయారు చేశారంటూ ఆరోపించారు మమతా బెనర్జీ. జనాన్ని మోసం చేయడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నారు దీదీ. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ గా అభివర్ణించారు సీఎం.
ఎల్ఐసీ, ఎస్బీఐ లలో ప్రజలు ,సామాన్యులు దాచుకున్న డబ్బులను అదానీ గ్రూప్ లో ఎవరు పెట్టేలా చేశారంటూ ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ.
Also Read : బీజేపీ ఎంపీలకు బడ్జెట్ పై క్లారిటీ