Indian Americans : యుఎస్ హౌస్ ప్యానల్స్ లో ఎన్నారైలు
అమెరికా సర్కార్ లో కీ పోస్టులు మనోళ్లకే
Indian Americans : ప్రవాస భారతీయుల హవా అమెరికాలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మనోళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఎన్నారైలు అన్ని రంగాలలో టాప్ కొనసాగుతున్నారు. ఇక యుఎస్ హౌస్ ప్యానల్స్ లో ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. విచిత్రం ఏమిటంటే ఏకంగా నలుగురు ప్రముఖ భారతీయ అమెరికన్(Indian Americans) చట్టసభ సభ్యులు మూడు కీలకమైన హౌస్ ప్యానల్ లో సభ్యులుగా నియమితులయ్యారు. యుఎస్ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపుతోంది.
ఈ నలుగురులో ప్రమీలా జయపాల్ , అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా ఉన్నారు. ఈ నలుగురు కీలకమైన నిర్ణయాత్మకమైన ప్యానల్స్ లో భాగస్వాములుగా ఉండడం భారతీయుల ప్రాముఖ్యతను తెలియ చేస్తోంది. కాంగ్రెస్ మహిళ జయ పాల్ ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన శక్తివంతమైన జ్యుడిషియరీ కమిటీ ప్యానెల్ లో ర్యాంకింగ్ మెంబర్ గా ఎంపికయ్యారు. సబ్ కమిటీకి నాయకత్వ పాత్రలో పని చేసిన మొదటి వలసదారుగా పేరు పొందారు.
16 ఏళ్ల వయస్సులో జేబులో ఏమీ లేకుండా ఈ దేశానికి వచ్చాను. 17 ఏళ్ల తర్వాత యుఎస్ పౌరసత్వం కోసం నిర్దేశించే ప్యానల్ కమిటీలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఇక 57 ఏళ్ల బెరా ఇంటెలిజెన్స్ యుఎస్ కమిటీలో సభ్యునిగా నియమించబడ్డారు. యుఎస్ భద్రతకు సంబంధించిన కీలక ప్యానల్ లో చేర్చడం ఆనందంగా ఉందన్నారు బెరా. అంతే కాదు ఫారిన్ అఫైర్స్ కమిటీ, హౌస్ సైన్స్ , స్పేస్ అండ్ టెక్నాలజీ కమిటీలో కూడా పని చేస్తున్నారు.
మరొకరు రాజా కృష్ణమూర్తి చైనాపై కొత్తగా రూపొందించిన హౌస్ కమిటీలో ర్యాంకింగా సభ్యునిగా ఎంపిక చేశారు. ఇది చైనా వ్యవహారాలను పరిశీలిస్తుంది. యుఎస్ ఆర్థిక, సాంకేతిక, భద్రతా పోటీని పరిస్కరించేందుకు పాలసీని పరిశోధించేందుకు , అభివృద్ది చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
Also Read : టూరిస్టుల కోసం భలే ఛాన్స్