Bandi Sanjay KCR : అన్నీ అబద్దాలు జనం చెవుల్లో పూలు
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కామెంట్స్
Bandi Sanjay KCR : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభపై సెటైర్లు వేశారు. అది బీఆర్ఎస్ సభ కాదని బక్వాస్ సభ అంటూ ఎద్దేవా చేశారు. అక్కడ చెప్పినవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు.
మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకవేళ అబద్దాలకు సంబంధించి ప్రపంచంలో ఆస్కార్ అవార్డు గనుక ఇస్తే మొట్టమొదటగా ఎంపికయ్యేది కేసీఆరేనని పేర్కొన్నారు బండి సంజయ్(Bandi Sanjay) .
బీఆర్ఎస్ యంత్రాంగమంతా నాందేడ్ లో మకాం వేశారు. పాలనను గాలికి వదిలి వేశారంటూ మండిపడ్డారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు గత నెల రోజులుగా అక్కడే ఉన్నారని కానీ జనాన్ని తీసుకు రాలేదని సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు బండి సంజయ్. పరువు పోతుందని భయపడి సరిహద్దు తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ. 500 ఇచ్చి తీసుకు వచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ చీఫ్.
బీఆర్ఎస్ గురించి దొర అదో మిషన్ అని గొప్పగా చెప్పారని..అది నిజమేనని ఎందులో అంటే అవినీతి మిషన్ , ఫ్యామిలీ కమిషన్ , కమీషన్ల మిషన్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ కు జనం మరిచి పోలేని రీతిలో షాక్ ఇవ్వడం ఖాయమన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
Also Read : అందరి ఆశలు తెలంగాణ బడ్జెట్ పైనే