Srisailam Shivaratri : బ్ర‌హ్మోత్స‌వాల‌కు ‘మ‌ల్ల‌న్న‌’ సిద్దం

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన స‌ర్కార్

Srisailam Shivaratri : భార‌త దేశంలో గుర్తింపు పొందిన శైవ క్షేత్రాల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ లోని న‌ల్ల‌మ‌ల్ల‌లో కొలువు తీరిన శ్రీ‌శైలంలోని మ‌ల్లికార్జున స్వామి, పార్వ‌తి శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలకు సిద్ద‌మైంది. 9 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించు కుంటార‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీ స‌ర్కార్ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇరు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ సంస్థ‌లు భారీ ఎత్తున బ‌స్సుల‌ను ఏర్పాటు చేశాయి. అంతే కాకుండా ద‌ర్శ‌న టికెట్లు కూడా మంజూరు చేస్తున్నాయి. దీని వ‌ల్ల ఉచిత వ‌స‌తితో పాటు ద‌ర్శ‌నం కూడా సూచించిన స‌మ‌యం మేర‌కు క‌లుగుతుంది. దీంతో ఎలాంటి ఆయాసం, ఇబ్బంది ఉండ‌దు.

ఇప్ప‌టికే శివ దీక్ష‌లు చేప‌ట్టిన స్వాములు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తూనే ఉన్నారు శ్రీ‌శైలం క్షేత్రానికి. ఇదిలా ఉండ‌గా శ్రీ‌శైలం ఆల‌య ఈవో ల‌వ‌న్న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పాద‌యాత్ర ద్వారా వ‌చ్చే వారికి ప‌లు చోట్ల చ‌ల‌వ పందిళ్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పాగాలంక‌ర‌ణ కోసం 4 వేల మంది సాదార‌ణ భ‌క్తులు, మ‌రో 4 వేల మ‌ది శివ స్వాముల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు ల‌వ‌న్న‌.

ఫిబ్ర‌వ‌రి 18న మ‌హా శివ‌రాత్రి(Srisailam Shivaratri) పండ‌గను జ‌రుపుకుంటారు హిందువులు. పర్వ‌దినం సంద‌ర్బంగా శైవ క్షేత్రాలు అన్నీ క‌ళ్యాణోత్స‌వానికి, బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉండ‌గా శ్రీ‌శైలంలో ఫిబ్ర‌వ‌రి 11 నుచి 21 వ‌ర‌కు మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. భ‌క్తులకు ప్ర‌త్యేక లైన్ల‌ను ఏర్పాటు చేశారు.

14 కంపార్ట్ మెంట్లు , శీఘ్ర ద‌ర్శ‌నం కోసం ప్ర‌త్యేక గ‌దులు కేటాయించారు. శీఘ్ర‌ద‌ర్శ‌నం కు 5 వేల టికెట్లు, అతి శీఘ్ర‌ద‌ర్శ‌నం 2 వేల టికెట్లు ఆన్ లైన్ లో ఉంచారు. ఉత్స‌వాల సంద‌ర్భంగా భారీ వాహ‌నాలు అనుమించ‌డం లేదు.

Also Read : మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!