PM Modi : త్రిపుర దక్షిణాసియాకు గేట్ వే – మోదీ
మారనుందని ప్రకటించిన ప్రధానమంత్రి
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. త్రిపుర దక్షిణాసియాకు గేట్ వే గా మారనుందన్నారు. త్రిపురలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ(PM Modi) ప్రసంగించారు. హైవేలు, ఇంటర్నెట్ మార్గాలు, రైల్వేలు , ఎయిర్ వేలు ఏర్పాటు చేస్తామని గతంలో హామీలు ఇచ్చానని చెప్పారు. ప్రాజెక్టుల పంపిణీని ప్రజలు త్వరలో చూడగలరని పేర్కొన్నారు.
త్రిపురలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు అభివృద్దిని అడ్డుకున్నాయని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ది పనులను హైలెట్ చేస్తూ ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియాకు గేట్ వేగా మారేందుకు సిద్దంగా ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శనివారం అంబాసాలో ఎన్నికల జరిగిన ర్యాలీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ నిర్మాణంలో గిరిజన ప్రజల సహకారాన్ని ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ వేసే పని ప్రస్తుతం త్రిపురలో జరుగుతోందన్నారు మోదీ(PM Modi). గత ఎనిమిది సంవత్సరాలలో త్రిపురలో మూడు రెట్లు ఎక్కువ ఆప్టికల్ ఫైబర్ వేశారని చెప్పారు. త్రిపురలో గ్రామాలను కలుపుతూ దాదాపు 5,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు నిర్మాణం జరిగిందన్నారు ప్రధాని. అగర్తాలలో కొత్త ఎయిర్ పోర్టు కూడా నిర్మించామన్నారు. ప్రస్తుతం త్రిపుర ప్రపంచ వ్యాప్తం అవుతోందన్నారు.
త్రిపుర దక్షిణాదికి గేట్ వేగా మారేందుకు ఎంతో దూరంలో లేదన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. హౌసింగ్ – ఆరోగ్యం – ఆదాయం అనే త్రిమూర్తులు త్రిపురను శక్తివంతం చేస్తున్నాయని అన్నారు . గత ఐదేళ్లలో పేదల కోసం బీజేపీ సర్కార్ దాదాపు 3 లక్షల పక్కా ఇళ్లు నిర్మించిందని చెప్పారు.
Also Read : మోదీ సర్కార్ పై థరూర్ సెటైర్